పెళ్లి చూపులు సినిమాతో హాస్య నటుడిగా సినీరంగ ప్రవేశం చేసాడు ప్రియదర్శి. ఆ చిత్రంలో తనదైన మార్క్ కామెడీతో అలరించాడు. ఒకవైపు హాస్యనటుడిగా మెప్పిస్తూ, మరోవైపు కథా బలం ఉన్న చిత్రాలలో హీరోగా నటిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలోని తన నటనతో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు దర్శి. తాజగా ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డార్లింగ్ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ రూ. 3.06కోట్లు నాన్ రికవర్ బుల్ అడ్వాన్స్ లెక్కన కొనుగోలు చేసింది. అటు ఏపీ థియేట్రికల్ హక్కులను ఏషియన్,సురేష్ సంస్థలు సంయుక్తంగా భారీ ధరకు కొనుగోలు చేసాయి. అదేవిధంగా నాన్ థియేట్రికల్ రైట్స్ స్టార్ మా సంస్థ ఏకంగా 6 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాకు ఈ స్థాయి బిజినెస్ జరగడం అంటే అభినందించదగ్గ విషయం. మరో వారంలో రిలీజ్ కాబోతున్న డార్లింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ఈ డార్లింగ్ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: Aswani Dutt: నక్క తోక నాలుగు సార్లు తొక్కిన నిర్మాత అశ్వినీదత్..కారణం ఏంటో తెలుసా..?