రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. భారతీయుడు -2కు మిశ్రమ స్పందన రావడం, నైజాం లాంటి ఏరియాలలో భారతీయుడు-2 అధిక టికెట్ ధరలు ఉండడం, నిన్న,నేడు హాలిడే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కల్కి చూసేందుకు ఆసక్తి చూపించారు. బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇండియన్ -2 కంటే కల్కికే ఎక్కువ బుక్ అయ్యాయి. కాగా ప్రపంచవ్యాపంగా కల్కి రూ. 1000కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి విజయవంతంగా రన్ అవుతోంది. ఓవర్ సీస్ లో $18 మిలియన్ల దిశగా దూసుకెళ్తోంది. కల్కి రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బేస్ మీద నిర్మాత ఆశ్వనీదత్ సొంత రిస్క్ పై విడుదల చేసారు. విడుదలైన అన్ని చోట్ల సూపర్ కలెక్షన్స్ తో డూసుకెళ్తూ బ్రేక్ ఈవెన్ సాధించింది.
మరోవైపు నిర్మాత అశ్వనీదత్ కు ఈ చిత్రం లాభాల వరద పారిస్తోంది. వరల్డ్ వైడ్ గా కల్కిసాధించిన కలెక్షన్స్ ప్రకారం నిర్మాత అశ్వినీదత్ కు ప్రస్తుతం అటు ఇటుగా రూ. 90 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తోంది. లాంగ్ రన్ లో రూ.100 కోట్లు పైగా లాభం వచ్చే అవకాశం ఉంది. కేవలం కథ, కథనంపై నమ్మకంతో నిర్మాత అశ్వినీదత్ ఓన్ రిలీజ్ చేసి నేడు లాభ ఫలాన్ని ఆస్వాదిస్తున్నాడు, ఒక్క సినిమాకు అన్ని లాభాలు అంటే నక్క తోక తొక్కినట్టే లెక్క.
Also Read : Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..