నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచుకుంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆదరణను తెలియచేస్తోంది.
Also Read: Allu: తాతా – మనువడి అల్లరి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లాయి. విడుదలైన మొదటి మూడు రోజుల్లో కమిటీ కుర్రోళ్లు సినిమా రూ. 6.04 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను దర్శకుడు యదు వంశీ ‘కమిటీ కుర్రోళ్ళు’లో చాలా చక్కగా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆద్యంతం అలరించాడు. ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ నిహారిక కొణిదెల చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మొదటి సినిమాతోనే చక్కటి సినిమాకు దర్శకత్వం వహించి హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యదువంశీ.