కలర్స్ స్వాతి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై అల్లరి పిల్లగా తన ముద్దు ముద్దు మాటలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ మంచి మంచి సినిమాలతో అలరించింది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వాతి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మలయాళ చిత్రాల్లో మంచి విజయాలు అందుకుంటున్న, తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె తెలుగు భారీ పాన్ ఇండియా సినిమాలో నటించబోతుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది.
Also Read:Shweta Basu Prasad: నన్ను ఎగతాళి చేస్తారేంటి? అంతా వారసత్వమే!
యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’.చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో ఓ యోధుడిగా కనిపించనున్నాడు నిఖిల్.ఇక ఇప్పటికే భారీ సెట్లు నిర్మించి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు షూట్ చేశారు. ఇక నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో, కీలకమైన ఓ మహిళా పాత్ర కూడా ఉందట. అయితే పాత్రకు మొదట కొత్త నటిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ చివరికి స్వాతిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో స్వాతి పాత్ర ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ ఎలిమెంట్‌ను అందించబోతుందని టాక్. ఇక భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల కానుంది.