టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 11 ఏళ్ల వయసుకే బాలనటిగా ‘మ’ అనే మూవీతో కెరీర్ ఆరంభించి ఈ చిన్నది, 2008లో తెరకెక్కిన ‘కొత్తబంగారు లోకం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత వరుస పెట్టి ‘రైడ్’, ‘కాస్కో’, ‘కళవర్ కింగ్’, ‘ప్రియుడు’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. కానీ ఒకటి కూడా తన కెరీర్ కి ప్లేస్ అవ్వలేదు. వరుస అవకాశాలు వచ్చినట్లే వచ్చి, డిజాస్టార్ అయ్యాయి. అలా 2018లో ‘విజేత’ మూవీ తర్వాత, ఆమె తిరిగి తెలుగులో నటించలేదు.. ప్రస్తుతం హిందీ సినిమాలు,సీరిస్‌లో నటిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు తను ఎదురుకున్న చేదు అనుభవం గురించి పంచుకుంది.
Also Read:Nainathra: భర్తతో కలిసి రొమాంటిక్ వీడియో షేర్ చేసిన నయనతార..
శ్వేతా బసు మాట్లాడుతూ..‘ నేను నాకు నచ్చిన సినిమాలు చేసి సంతృప్తిగానే ఉన్నాను . ప్రస్తుతం టెలివిజన్ లో రాణిస్తున్నాను. కానీ కెరీర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్ లో చాలా ఇబ్బందిపడ్డాను. ఎందుకంటే హీరోతో పోలిస్తే నా ఎత్తు తక్కువ. దీంతో హీరో ఆరడుగులు ఉంటే ఈవిడేమో 5 అడుగులు ఉంది అని సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. దానికి తోడు హీరోతో వచ్చిన సమస్య మరో స్థాయిలో ఉంది. అతను ప్రతి సన్నివేశాన్ని మార్చేస్తూ ఉండేవాడు. గందరగోళంగా అనిపించేది.. రీటేక్ ఎక్కువగా తీసుకునేవాడు. అతని మాతృభాష తెలుగే. అయినప్పటికీ అతడికి భాషపై పట్టు లేదు. కానీ నన్ను మాత్రం నా కంట్రోల్ లో లేని నా ఎత్తు గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది దానికి నేనేం చేసేది. నాకు తెలిసి నేను అంత బాధ పడిన సెట్ ఏదైనా ఉందంటే అదే’ అని శ్వేతా బసు ప్రసాద్ పేర్కొంది.