Rajnikanth : “వెట్టయన్ ది హంటర్”కి ప్రీక్వెల్ చేయాలని ఉంది : టి.జె. జ్ఞానవేల్
- రజనీకాంత్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘వెట్టయన్ ది హంటర్’
- మీడియాతో ముచ్చటించిన దర్శకుడు టి జె జ్ఞానవేల్
- వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబడుతూన్న వెట్టయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా సందర్భంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘వెట్టయన్ ది హంటర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయ్యన్ ది హంటర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ఇంత ఆదరణ దక్కడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ లీలా కీలక విషయాలెన్నో తెలిపారు.
* జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ గారెతో ఇలాంటి ప్రాజెక్ట్ ఎలా అనుకున్నారు?
Ans : రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాను రూపొందించడమే నా మెయిన్ టార్గెట్. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. ఆయన అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
* జర్నలిస్టుగా మీకున్న అనుభవం ఈ సినిమాకు ఎలా ఉపయోగపడింది? రజనీకాంత్‌ను ఏమైనా సలహాలు, సూచనలు అందించారా?
Ans : రజినీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.
* సినిమా కథ ఎన్‌కౌంటర్లు, న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగింది. వీటిని పరిశోధించడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి?
Ans : దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్‌కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఈ చిత్రం స్పృశిస్తుంది.
* అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆయన్ని ఎవరు? ఎందుకు ఎంపిక చేశారు?
Ans : అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.
* సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని సీరియస్ కథతో ఎలా బ్యాలెన్స్ చేసారు?
Ans : అలా బ్యాలెన్స్ చేయడమే అతి కష్టమైన పని. ‘వెట్టయన్’ వినోదాన్ని కోరుకునే రజనీకాంత్ అభిమానులకు, ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు ఇలా అందరికీ నచ్చుతుంది. నేను రాజ్యాంగం, న్యాయ ప్రక్రియ యొక్క శక్తిని విశ్వసిస్తాను. అదే మీకు సినిమాలోనూ కనిపిస్తుంది. రజనీకాంత్ నుంచి కోరుకునే యాక్షన్ సీక్వెన్స్‌లను కథనంలో అంతర్లీనంగా ఉండేలా చూసుకున్నాను.
* ఫహద్ పాత్ర కథా కథనాన్ని ఎందుకు అలా ముగించారు?
Ans : ఫహద్ పాత్ర స్క్రీన్ ప్లేలో కీలకంగా ఉంటుంది. అతను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థకే అతను బాధితుడయ్యాడు.
* ఈ కథ రాయడానికి మీ స్పూర్తి, ప్రేరణ ఏంటి?
Ans : నిజ-జీవిత ఎన్‌కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.
* ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత రజినీకాంత్‌ని ఎలా ఒప్పించారు?
Ans : రజినీకాంత్ గారి కూతురు నా దగ్గరకు వచ్చారు. తన తండ్రికి సరిపోయే కథలు ఉన్నాయా అని ఆరా తీశారు. నాకు అదే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆయన నా శైలిని అర్థం చేసుకున్నారు. నాకు కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడంను ఇచ్చారు.
*’వెట్టయన్’కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?
Ans : నేను ప్రీక్వెల్‌ను చేయడానికి ఎక్కువ ఆసక్తితో ఉన్నాను. ‘వెట్టయన్: ది హంటర్’ అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!