జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్ తినటమే కాదు ఆమెకు పీసీఓడీ లాంటి ఆరోగ్య సమస్య కూడా ఉండటంతో బరువు నియంత్రించుకోవటం కష్టమయ్యేదట. కానీ, సినిమా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాక సారా రకరకాల డైట్స్, వర్కవుట్స్ చేసింది. వాటితో పాటూ యోగా చేస్తూ తనని తాను సన్నజాజి మల్లెలా మార్చుకుంది. ఈ సారి యోగా దినోత్సవం సందర్భంగా ఒంటి కాలుపై నిలబడి కెమెరాకు ఫోజిచ్చింది! ఆమెని ఇప్పుడు చూస్తే ఒకప్పుడు అటుఇటుగా వంద కేజీలు ఉండేదంటే ఎవరూ నమ్మలేరు…
Read Also : ‘సత్యమేవ జయతే 2’ షూటింగ్ కంప్లీట్… టికెట్ కౌంటర్స్ వద్దకి బయలుదేరుతోన్న జాన్ అబ్రహాం…
బాలీవుడ్ కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనా కూడా తన సొషల్ మీడియా పోస్టులో యోగా గొప్పతనం వివరించింది. ఆమె సోదరి రంగోలి ఛండేల్ యాసిడ్ దాడికి గురై కూడా ఎలా ఆ దారుణమైన స్థితి నుంచీ బయటపడిందో తెలిపింది. యోగా ద్వారా శారీరిక, మానసిక ఆరోగ్యమే కాదు కోల్పోయిన కంటి చూపు తిరిగి పొందటం లాంటి అసాధ్యాలు కూడా సాధ్యమేనంటోంది కంగనా. అందుకు, తన సోదరి రంగోలీనే తార్కాణం అని చెబోతోంది… బాలీవుడ్ లో యోగా పేరు చెబితే నెటిజన్స్ కు గుర్తుకు వచ్చే సెలబ్రిటీల్లో మిలింద్ సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్ కూడా తప్పక ఉంటారు. ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ కపుల్ రెగ్యులర్ గా యోగాసనాలు వేస్తూ, వీడియోలు షేర్ చేస్తుంటారు. అత్యంత క్లిష్టమైన వాట్ని కూడా అవలీలగా వేస్తూ… మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా… యోగ కపుల్ అనిపించుకుంటున్నారు!
ఆన్ స్క్రీన్ లో తమ డ్యాన్స్, యాక్షన్ తో కళ్లు అర్పకుండా కూర్చోబెట్టే బాలీవుడ్ బ్యూటీస్ జాక్విలిన్, తాప్సీ. వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ లోనూ రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు. తమ ఫోటోల్ని, వీడియోల్ని ఫాలోయర్స్ కోసం షేర్ చేస్తారు కూడా. వార్ని ఇన్ స్పైర్ చేసేందుకు యోగా గురించి తమ మనసులోని మాటల్ని ఎప్పటికప్పుడు చెబుతుంటారు!
సారా, జాక్విలిన్, తాప్సీ… వీరంతా యంగర్ బ్యూటీస్. సీనియర్ సుందరీమణులు కూడా బాలీవుడ్ లో వెనక్కి తగ్గటం లేదు. శిల్పా శెట్టి, మలైకా అరోరా లాంటి 40 ప్లస్ గార్జియస్ లేడీస్ కూడా ఇప్పుడు యోగా ఎక్స్ పర్ట్సే! శిల్పా, మలైకా తమ నాజూకు శరీరాల్ని మన్మథుడి ధనస్సులా వంచేస్తుంటే… ఈ తరం టీనేజ్ కుర్రాళ్లు కూడా నోరెళ్లబెట్టాల్సిందే!