వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా “బైసన్” ఇప్పుడు తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 24న థియేటర్లలో ప్రేక్షకులను కలవబోతోంది ఈ చిత్రం లో అనుపమ హీరోయిన్ గా నటించింది.
Also Read : Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో అనుపమ తన అనుభవాలను పంచుకుంది ‘మారి సెల్వరాజ్ గారి సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఆయన మొదటి చిత్రంలోనే నటించాల్సింది కానీ, అప్పట్లో షెడ్యూల్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు. కానీ ఇప్పుడు ‘బైసన్ లో ఆయనతో పనిచేసే అవకాశం రావడం నాకు నిజంగా స్పెషల్. ఈ సినిమా నాకు కొత్తగా చాలా నేర్పింది. ధృవ్ విక్రమ్ లో ఉన్న ప్యాషన్ అద్భుతం.. సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. షూటింగ్ సమయంలో ఆయనలో కనిపించిన ఆ డెడికేషన్ చూసి నేనూ ఇన్‌స్పైర్ అయ్యాను. ధృవ్‌తో స్క్రీన్ షేర్ చేయడం నాకు గర్వంగా ఉంది. అనుకున్నట్లుగానే తమిళంలో ఈ మూవీ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్టోబర్ 24న తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్‌తో ‘బైసన్’ ఇక్కడ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగులో ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి స్పెషల్ థాంక్స్” అని ఆమె చెప్పుకొచ్చింది.