Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల భామ రష్మిక మందన్నా తాజాగా నటించిన హారర్ కామెడీ చిత్రం “థామా” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి టాక్ అందుకుంటుండటంతో రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన థామా జర్నీ గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
Also Read : Ravi Teja : RT76పై ఆషికా రంగనాథ్ నుంచి సాలిడ్ అప్డేట్ – స్పెయిన్‌లో షూట్ జోరుగా!
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
“థామా.. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ ప్రయాణంలో నవ్వులు, అలసట, కష్టాలు, గాయాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ అనుభవం మాత్రం నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని ఉదయాలు షూట్‌కి వెళ్లాలనిపించలేదు, కానీ సెట్‌లో అడుగు పెట్టగానే అందరి ఎనర్జీ చూసి మళ్లీ జోష్ వచ్చేది” అని రష్మిక రాసుకొచ్చింది. అలాగే దర్శకుడు ఆదిత్య సర్పోదర్ గురించి మాట్లాడుతూ .. “ఆయన నాపై ఉంచిన నమ్మకం చాలా పెద్దది. ప్రతి సన్నివేశం వెనుక ఆయన ప్యాషన్, కష్టపడే తత్వం స్పష్టంగా కనిపించింది. మొత్తం టీమ్ సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా పూర్తయింది. కొండల్లో షూటింగ్ చేసిన రోజులు, సిబ్బంది పడిన శ్రమ అన్నీ గుర్తు చేసుకుంటే గర్వంగా ఉంది” అని చెప్పింది.
తన అభిమానుల గురించి కూడా రష్మిక ప్రస్తావించింది.. “మీ అందరి ప్రేమ, మద్దతు, నమ్మకం నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంటాయి. మీరు పంపే ప్రతి మెసేజ్, ప్రతి ఫీడ్బ్యాక్ నా హృదయాన్ని తాకుతుంది. ఈ ప్రేమే నా అసలైన శక్తి,” అని ఆమె భావోద్వేగంగా తెలిపింది. ఇక థామా సినిమాను మాడాక్ ఫిల్మ్స్ నిర్మించగా, స్త్రీ, భేడియా, ముంజ్యా వంటి హిట్స్ తర్వాత ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన మరో ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ మూమెంట్స్, ఫన్ సీన్స్ కలిపి థామా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని టాక్.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!