గుంటూరు మస్తాన్ సాయి అనే యువకుడు కేసు ప్రతి రోజు అనేక మలుపులు తిరుగుతోంది. అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఈ కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని గుంటూరులో మస్తాన్ సాయి పై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలు ఆడినట్టు వెలుగులోకి వచ్చింది. ఛార్జ్ షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులు పోలీసులు ఇద్దామని మస్తాన్ సాయి, తండ్రి ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా ఉన్న ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక అలా పోలీసులకు డబ్బు ఎర వేసి ఛార్జ్ షీట్ తమకు అనుకూలంగా మస్తాన్ సాయి మార్చుకున్నట్టు తాజాగా ఆడియోతో బట్టబయలు అయ్యింది.
Tollywood: టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో కొత్త ప్రొడక్షన్ హౌస్
ఇక లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మనకు అనుకూలంగా ఛార్జ్ షీట్ ఉండాలని మస్తాన్ సాయి తండ్రితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇక లావణ్య, మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ముందు వరకు హార్డ్ డిస్క్, యువతుల వీడీయోలు చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు డ్రగ్స్ టర్న్ తీసుకుంది. మస్తాన్ సాయి ఇంట్లో చేసుకున్న డ్రగ్స్ పార్టీలపై విచారణ చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పలువురు యువతులను పార్టీ అని పిలిచి డ్రగ్స్ ఇచ్చి వారికి తెలియకుండా వీడియోలు రికార్డు చేశారు మస్తాన్ సాయి. డ్రగ్స్ పార్టీల వీడియోల్లో ఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టి రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే నగ్న వీడియోలు చిత్రీకరించారు అని మస్తాన్ సాయి తో పాటు ఖాజను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు. ఖాజాకు 41 నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు.