MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత
- కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని వ్యాఖ్యలు.
- మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఆవిడ పేర్కొన్నారు. ఐఫోన్ స్థిరమైన పనితీరుకు ప్రాధాన్యం కల్పిస్తే, చైనా ఫోన్ బయటకు బాగుంటుందని.. కానీ, సరిగ్గా పని చేయదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కూడా మాటలు చెప్పి బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Also Read
కవిత తమ ప్రసంగంలో బీసీ సమాజంపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. “ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?” అని ఆమె ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో తూతూ మంత్రంగా సమావేశాలు పెట్టడం కాకుండా, స్వయంగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని, మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also: Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
అలాగే రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకుండా రైతులను కష్టాల్లో నెట్టిందని, ఎండిపోయిన పొలాలను చూస్తుంటే రైతులు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను కాపాడే తెలివి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హామీలను ప్రస్తావిస్తూ.. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ. 2,500 సహాయం ఏమయ్యాయి? మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని కవిత అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రస్తావిస్తూ, ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీకి జగిత్యాలలో అడ్రస్ ఉండదని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!