తన అందం, అభినయంతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన హీరోయిన్ సాయి పల్లవి. వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇక యూత్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందరూ హీరోయిన్స్‌లా కాకుండా ఈ ముద్దుగుమ్మ తన రూటే సెపరేట్ అనేలా ఉంటుంది. ఒక ఎక్స్ పోజ్ ఉండదు, ఒక మేకప్ ఉండదు, ఎలాంటి ఆడంబరాలు ఉండవు. తన సింప్లిసిటీ తోనే జనాల హృదయాలను కట్టిపడేస్తోంది. మూవీ సెలక్షన్ విషయంలో కూడా సాయిపల్లవి ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌కి మాత్రం చాలా ధూరంగా ఉంటుంది. ఇక గత ఏడాది ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకు ఈ చిన్నది, తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘తండేల్’ సినిమాతో వచ్చి బాక్సాఫీసు వద్ద మరో ఘన విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఓ రొమాంటిక్ హీరోకి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read:Tandel: ‘తండేల్’ 3 డే కలెక్షన్స్..దుల్ల గొట్టేస్తున్నాడుగా !
కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న ‘STR-49’లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే హీరో శింబు గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించే సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే ఈ మూవీలో సాయిపల్లవి నటిస్తుందా లేదా క్లారిటీ లేనప్పటికి. ఇలాంటి హీరోతో నటించడానికి సాయి పల్లవి ఎలా ఓకే చెప్పింది.. అసలు ఆ సినిమాకు ఎందుకు ఒప్పుకుందని ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక వేళ కనుక ఈ వార్తలో నిజం ఉంటే, సాయి పల్లవి పాత్ర ఎలా డిజైన్ చేస్తారో వేచి చూడాలి.