అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. అక్కినేని నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చేసాడని అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు క్రిటిక్స్ కూడా చైతూను ప్రశంశలతో ముంచెత్తారు.
Also Read : Raghava Lawrence : కాంచన 4ను పట్టాలెక్కించిన లారెన్స్
తండేల్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చైతు కెరీర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. అటు ఓవర్సీస్‌లో లోను డే 1 – 400K డాలర్స్ తో నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టి ఇటీవల 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. కాగా తండేల్ విడుదలైన 9 రోజుల నాటికి వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను దాటింది. అక్కినేని ఫ్యామిలీలో మొట్ట మొదటి వంద కోట్ల హీరోగా చైతు సెన్సేషన్ చేసాడు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మొత్తానికి అక్కినేని అభిమానుల వంద కోట్లగ్రాస్ డిమాండ్ ను తండేల్ తో నాగ చైతన్య తీర్చడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ నిర్మించారు.