హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు.
Also Read :Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కాంచన 4లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫమ్ అయ్యింది. బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహీ మరో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది అని ఎప్పటో నుండో వార్తలు వస్తున్న కూడా ఇప్పటి వరకు స్టార్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసాడు రాఘవ లారెన్స్. కాంచన మునుపటి సిరీస్ ల కంటే కాంచన 4ను అత్యంత భారీగా దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాంచననే కాకుండా శివలింగ, చంద్రముఖి2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే కాంచనను లక్ష్మీ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరీ కాంచన 4ను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరీ అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.