ఆంధ్రాలో ఇటీవల సినిమాలకు సంభందించిన ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్లు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటినటుల థియేటర్స్ విజిట్ సందడి ఎక్కువాగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పిఠాపురంలో సినిమా ఈవెంట్స్ నిర్వహించేందుకు నిర్మాతలు, హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఆ మధ్య శర్వానంద్ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ‘మనమే’ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారు మేకర్స్. అనివార్య కారణాల వలన ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
Also Read: Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
కాగా పిఠాపురంలో మరొక సినిమా కార్యక్రమం నిర్వహింబోతున్నారు. నార్నె నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆయ్’ మేం ఫ్రెండ్స్ అండి అనేది ఉపశీర్షిక. చిన్న సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ ఈ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఆయ్ ట్రైలర్ ను ఆగస్టు 5న 11:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ పవర్ స్టార్ నియోజకవర్గమైన పిఠాపురంలోని సత్యకృష్ణ కన్వెన్షన్ గొల్లప్రోలు లో నిర్వహించబోతున్నారు. పిఠాపురంలో జరగబోయే ఫస్ట్ సినిమా కార్యక్రమం ఆయ్ అనే చెప్పాలి. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ తరపున ప్రచారం చేసిన నేపథ్యంలో అల్లూ బ్యానర్ సినిమా కార్యక్రమం పిఠాపురంలో జరపడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ వస్తారో లేదో చూడాలి. రెండు భారీ సినిమాల మధ్య ఆగస్టు 16న ‘ఆయ్’ థియేటర్లలో విడుదల కానుంది.