35CKK August 15: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని ముందు నిర్ణయం తీసుకున్నారు మేకర్లు. అయితే ఆగస్టు 15వ తేదీ ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒక తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతున్నాయి.
Also Read: NBK 109: బాలయ్యతో కీలక ఘట్టం ముగిసింది.. బాబీ ఆసక్తికర పోస్ట్
దానితో పాటు అదే రోజు రిలీజ్ డేట్ వేసుకుని థియేటర్లు దొరక్క ఒక రోజు తర్వాత ఆయ్ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఇంత హడావిడిలో ఈ చిన్న సినిమాకు రిలీజ్ కాస్త ఇబ్బందికర అంశమే. నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ వద్ద కొన్ని థియేటర్లు ఉన్నా సరే ఇప్పుడున్న హడావుడిలో రిలీజ్ చేయడం వల్ల సినిమా విజిబులిటీ దెబ్బ తినే అవకాశం ఉంది. బహుశా ఆ ఆలోచనతోనే ఈ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి సినిమాని ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడం లేదు అని ప్రకటించారు. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనే విషయం అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.