150 Crores Budjet for Nani and Srikanth Odela ‘Nani 33’: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దసరా అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల నానిని ఒక ఫ్యామిలీ హీరో లాగానో లేక లవర్ బాయ్ లాగానో కాకుండా ఒక ఫుల్ లెంత్ మాస్ మాసాలా రోల్ లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. నాని అలాంటి పాత్ర చేస్తాడని కూడా ఊహించని మనోళ్లు సినిమాని సూపర్ హిట్ చేసి పెట్టారు. ఇక ఈ సినిమా నాని కెరీర్ లో 100 కోట్ల గ్రాసింగ్ సినిమాగా కూడా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత నాని చేసిన హాయ్ నాన్న అందరికీ కనెక్ట్ కాకపోవడంతో ఆ మేర వసూళ్లు అందుకోలేక పోయింది.
Arjun Das: ముందు చేయొద్దనుకున్నా.. కల్కి ‘కృష్ణుడి’ సోషల్ మీడియా పోస్ట్ వైరల్
ఇక ఇప్పుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా మొత్తం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 120 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాని మార్కెట్ తో పోలిస్తే ఇది పెద్ద మొత్తమే అయినా కంటెంట్ మీద కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో అంత పెట్టడానికి కూడా నిర్మాత సిద్ధం అయినట్టు తెలుస్తోంది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. నాని 33 సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా 1992, 93 బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి నాని మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.