Arjun Das Emotional Post about Kalki 2898 AD: కల్కి సినిమాలో కృష్ణుడిగా సూరారై పోట్రు సినిమాలో నటించిన నటుడు నటించగా ఆయనకు వాయిస్ మాత్రం నటుడు అర్జున్ దాస్ ఇచ్చాడు. తాజాగా ఈ విషయం మీద అర్జున్ దాస్ ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. కొన్ని వారాల క్రితం స్వప్న నుండి నాకు కాల్ వచ్చింది, ఆమె నువ్వు కల్కిలో కృష్ణుడికి డబ్బింగ్ చెప్పాలని అడిగితే
మొదట్లో కొంచెం సంకోచించాను, అయితే ఆమె రెండు విషయాలు చెప్పింది – “మీరు అమితాబ్ బచ్చన్‌తో మాట్లాడతారు”, “మమ్మల్ని నమ్మండి” అని. నేను చిన్నప్పటి నుండి అమితాబ్ అభిమానిని, ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించే వాడిని. పాఠశాల, కళాశాలలోనూ అమితాబ్ వాయిస్, మిమిక్రీ చేయడానికి చూసేవాడిని ఆ వాయిస్ నాకు అంత ఖచ్చితంగా వస్తుందో నాకు తెలియదు.
Supritha: సాంప్రదాయనీ… ‘సుప్పి’నీ.. ఏంటిదీ?
నేను హైదరాబాద్‌కి వెళ్లి స్టూడియోకి చేరుకున్న క్షణం నాకు ఇంకా గుర్తుంది. అమితాబ్ సర్ డబ్ ప్లే చేయమని ఇంజనీర్‌ని అభ్యర్థించా, అది నేను విన్న క్షణం నుండి బచ్చన్ సర్ స్వరం, అది నాలో సింక్ అవడానికి కొంత సమయం పట్టింది. నా తలలో ఐకానిక్ డైలాగ్స్ ప్లే అవుతున్నాయి, స్కూల్లో ఉన్నన్ని రోజులూ తన వాయిస్ తో ప్రేక్షకుల ముందు డైలాగ్స్ చెప్పే నేను అతని స్వరాన్ని వింటున్నాను. ఆయనతో డైలాగులు కూడా షేర్ చేసుకోనున్నాను. ప్చ్! నేను మామూలు మనిషిని అవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఆ తరువాత డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాను. తరువాతి మూడు రోజులలో, నాగ్ అశ్విన్ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, నాతో కూర్చుని డబ్బింగ్ విషయంలో నాకు మార్గనిర్దేశం చేశాడు. దురదృష్టవశాత్తూ సమయాభావం వల్ల నేను తెలుగు & హిందీలో మాత్రమే డబ్ చేయగలిగాను. నాగ్ చాలా ఓపికగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు స్వప్నా, మీరు ఊహించిన దానికి నేను కొంచెం దగ్గరగా రాగలిగానని ఆశిస్తున్నాను. వాయిస్‌ఓవర్‌కు సంబంధించి నాకు సందేశం పంపడానికి సమయాన్ని వెచ్చించినందుకు మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇంతకు ముందు చెప్పినట్లుగా, క్రెడిట్ నాగ్ & స్వప్నకు మాత్రమే దక్కాలి. వైజయంతీ మూవీస్, స్వప్న, నాగ్ అశ్విన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ & మీ గొప్ప పనిలో చిన్న భాగం కావడానికి నన్ను అనుమతించినందుకు సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు సమీపంలోని థియేటర్‌లో కల్కిని చూడండి అని ఆయన కోరారు. P.S (చిన్నప్పుడు బచ్చన్ సర్‌కి డైలాగులు చెబుతానని కలలో కూడా అనుకోలేదు. కల్కి టీమ్‌కి ధన్యవాదాలు) బచ్చన్ సర్, “నాదగ్గర డబ్బు భవనాలు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్, బంగ్లా, కారు ఉన్నాయి నీదగ్గర ఉం ఏమిటి?” అని ఎవరైనా నన్ను అడిగితే ” నా దగ్గర బచ్చన్ సర్‌తో డైలాగ్ ఉంది” అని గర్వంగా చెబుతానని రాసుకొచ్చాడు.
.@VyjayanthiFilms @SwapnaDuttCh @nagashwin7 @SrBachchan Sir #Prabhas Garu #Kalki2898AD
#ForeverGrateful pic.twitter.com/DhQdovF4BE— Arjun Das (@iam_arjundas) July 3, 2024