Chiranjeevi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మూవీ టీమ్ ఎవరూ ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కానీ ఇక్కడే ఓ విషయం మాట్లాడుకోవాలి.
Read Also : Pawankalyan : మెగా ఫ్యామిలీకి ఆ లోటు తీర్చేసిన పవన్
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయట్లేదు. పైగా ప్రభాస్ కు తండ్రి పాత్రలో ఆయన కనిపించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే చిరంజీవి ప్రస్తుతం మెయిన్ హీరోగా కొన్ని సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఓ వైపు మన శివ శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అలాగే విశ్వంభర సమ్మర్ కు వస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. దానికి ఇంకో రెండేళ్లు పడుతుంది. కాబట్టి ఓ వైపు మెయిన్ హీరోగా చేస్తున్న టైమ్ లో ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపించే ఛాన్స్ లేదు. అలా కనిపిస్తే తన మెయిన్ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. పైగా ప్రభాస్ కూడా చిరంజీవిని అడిగేంత ముందడుగు వేయడు. సందీప్ రెడ్డి కూడా చిరంజీవితో అలాంటి పాత్ర చేయించాలని అస్సలు అనుకోడు. కాబట్టి ఇందులో నిజం లేదనే అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Bhagyashree : టైట్ డ్రెస్ లో భాగ్య శ్రీ అందాల బీభత్సం