Pawankalyan : మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా హీరోల నుంచి సినిమా రాని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరం మెగా సినిమాలు థియేటర్ల వద్ద ఏదో ఒకటి అయినా హిట్ కొడుతుంది. అయితే ఈ ఏడాది మొదట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అందరి అంచనాలు ఓజీ మీదనే ఉండేవి. ఎందుకంటే ఓజీలో పవన్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారో అలాగే కనిపించారు.
Read Also : Bhagyashree : టైట్ డ్రెస్ లో భాగ్య శ్రీ అందాల బీభత్సం
ఈ ఏడాది హిట్ కొట్టకుండానే మెగా ఫ్యామిలీ ఉంటుందా అనుకుంటున్న టైమ్ లో ఓజీ ఆ కోరికను తీర్చేసింది. ఓజీ సినిమా ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఉండటంతో హిట్ వచ్చి పడింది. దీంతో మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది ఓజీ రూపంలో మంచి హిట్ పడిందన్నమాట. దీని తర్వాత ఈ ఏడాది మెగా హీరోల నుంచి వేరే సినిమాలు లేవు. వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అది డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే ఉంది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Read Also : Niharika : ప్రజెంట్ వేరుగా ఉంటున్నా.. నిహారిక కామెంట్స్