Chiranjeevi Satire On Garikipati Narasimha Rao: ఆమధ్య ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! తాను ప్రసంగిస్తున్న సమయంలోనే తన అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతుండటంతో కోపాద్రిక్తులైన గరికిపాటి.. ‘వెంటనే ఫొటో సెషన్ ఆపేసి చిరంజీవి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా’నని హెచ్చరించారు. ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. అభిమానులతో పాటు కొందరు సినీ తారలు గరికిపాటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. ఓ సందర్భంలో ‘ఆయన పెద్ద మనిషి, ఆయన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని చిరు చెప్పడంతో, ఆ వివాదానికి తెరపడింది.
కట్ చేస్తే.. ఇప్పుడు చిరంజీవి మళ్లీ పరోక్షంగా గరికిపాటిపై సెటైర్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా.. అక్కడ కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకి వచ్చారు. అప్పుడు చిరు వెంటనే మైక్ అందుకొని.. ‘ఇక్కడ వారు లేరు కదా’ అంటూ గరికిపాటిని ఉద్దేశించి సెటైరికల్ ప్రశ్న సంధించారు. దీంతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేస్తూ.. ‘లేరు’ అని సమాధానం ఇచ్చారు. అది విని చిరు గుండెల మీద చెయ్యి వేసుకొని ‘హమ్మయ్యా’ అంటూ రిలాక్స్ అయినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. చిరు టైమింగ్ అదిరిందని, భలే సెటైర్ వేశారని కామెంట్లు చేస్తున్నారు.
Megastar #Chiranjeevi Recent Video
BOSS @KChiruTweets Super Punch
Ekkada Vaaru leru kada 🤣#MegastarChiranjeevi #WaltairVeerayya pic.twitter.com/xUuf4YDHDt— Chiranjeevi Army (@chiranjeeviarmy) October 28, 2022