Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తెల్సిందే. అస్సలు ఆయన మెగాస్టార్ గా మారిందే ఆ టైమింగ్ వలన.. కథలను ఎంచుకోవడం, డ్యాన్స్ లో క్రేజ్.. కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసులను ఫిదా చేసి ఒక హీరో దగ్గరనుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ చిరు లో అల్టిమేట్ ఏదైనా ఉంది అంటే అది కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. రీల్ అయినా.. రియల్ అయినా.. స్టేజి మీద అయినా.. ఇంటర్వ్యూ లో అయినా చిరు వేసే పంచ్ లకు అందరు షాక్ అవ్వాల్సిందే. ఇక ప్రస్తుతం చిరు నటించిన భోళా శంకర్ ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో వరుస ప్రమోషన్స్ తో చిరు దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరు.. దిల్ రాజు ను ఆడేసుకున్నాడు.
Abbas: విశాల్ చాలామందిని పాడు చేశాడు.. అందుకే అతడంటే పగ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చీరాని తమిళ్ లో దిల్ రాజు ఇచ్చిన స్పీచ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ” డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్ వెనుమా ఫైట్స్ ఇరుక్కు.. స్టైల్ వెనుమా స్టైల్ ఇరుక్కు.. ఎల్లామే ఇరుక్కు.. అదుదా సర్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ డైలాగ్స్ ను పట్టుకొని సోషల్ మీడియా ఏ రేంజ్ లో హార్ట్ కింగ్ ను ఆడుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా భోళా శంకర్ ప్రమోషన్స్ లో ఇదే డైలాగ్ ను చిరు ఇమిటేట్ చేశాడు. డ్యాన్స్ వెనుమా డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్ వెనుమా ఫైట్స్ ఇరుక్కు.. స్టైల్ వెనుమా స్టైల్ ఇరుక్కు.. ఎల్లామే ఇరుక్కు.. అదుదా సర్ అంటూ నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏంటి.. బాసూ.. దిల్ రాజునూ అలా ఆడేసుకున్నావ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.