టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఒకటి. 1990లో విడుదలైన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఇక అశ్వనీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం, శ్రీదేవి అందాలు, చిరంజీవి నటన, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ.. ఇలా అందరి శ్రమ ఈ సినిమా అఖండ విజయానికి కారణమయ్యింది. అయితే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి.
Also Read: Sri Vishnu : ఏకంగా 3 సినిమాలు లైన్ లో పెట్టిన యంగ్ హీరో..
ఇందులో భాగంగా ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారు? సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయాల గురించి మాట్లాడుకుంటే.. అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమాను నిర్మాత అశ్వినీదత్ అప్పట్లోనే రూ.2 కోట్లు పెట్టి నిర్మించారట. కానీ సినిమా చూస్తే ఇంతటి భారీ సినిమాను కేవలం రూ.2 కోట్లతో పూర్తి చేశారా అంటే గ్రేట్ అనే చెప్పాలి. రిలీజ్ టైమ్ లో భారీ వర్షాలుండటంతో ఫస్ట్ వీక్ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదట. ఆ తర్వాత వర్షాలు తగ్గడంతో థియేటర్ల కౌంట్ తో పాటూ హౌస్ ఫుల్స్ పెరిగాయి. అలా మంచి రన్ తో ఈ సినిమా రూ.15 కోట్లు కలెక్ట్ చేసిందట. ఇక ఈ మూవీ కోసం చిరంజీవి రూ.25 లక్షలు పారితోషికం తీసుకోగా, శ్రీదేవి రూ.20 లక్షలు అందుకున్నారట.