యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ‘స్వాగ్’ మూవీలో మూడు డిఫరెంట్ షేడ్స్ తో అద్భుతంగా నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు ‘సింగిల్’ సినిమాతో రాబోతున్నాడు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా మే 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన నుంచి రానున్న మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్‌ల గురించి పంచుకున్నాడు శ్రీవిష్ణు.
Also Read: web series : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కోవై సరళ..
దేనికదే సెపరేట్ కాన్సెప్ట్‌లతో అలరించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడ. ఇంతకీ ఏంటా కాన్సెప్ట్ లు అంటే.. తెలుగు ఆడియెన్స్‌కి ఎంతో ఇష్టమైన ‘అమృతం’ సీరియల్ దర్శకుడు గుణ్ణం గంగరాజు బ్యానర్ లో ‘మృత్యుంజయ’ అనే సినిమా చేస్తున్నాడట విష్ణు ఇది ఆల్రెడీ 30 రోజులు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందట. ఇక ఈ చిత్రం కాకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని కూడా ప్లాన్ చేస్తుండగా, ఇవి కాకుండా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ చేయనున్నట్టుగా తెలిపాడు. ఇలా మొత్తం మూడు సినిమాలు వేరు వేరు కేటగిరిలో తాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు ‘సింగిల్’ తో మన ముందుకు వస్తున్నప్పటికి. మిగతా మూడు చిత్రాలు వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ అవుతాయని చెబుతున్నాడు. మరి మొత్తానికి శ్రీవిష్ణు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాడని చెప్పాలి.