ఛార్మి అందం హిందోళం పాడేది. ఆమె అధరం తాంబూలం సేవించమనేది. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ వచ్చీ రాగానే జనాన్ని ఆకట్టుకుంది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఛార్మి కౌర్ 1987 మే 17న పంజాబ్ లోని లూధియానాలో జన్మించింది. ఛార్మికి సినిమాల్లో…