Unstoppable 2: ఆహా ఓటిటీ రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలతో, సరికొత్త కాంబినేషనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేయడం నెవ్వర్ బిఫోర్ అనుకున్నారు. కానీ ఆహా దాన్ని నిజం చేసి చూపించింది. అన్ స్టాపబుల్ షో లో బాలయ్యను తీసుకొచ్చి షాక్ ఇవ్వడమే కాకుండా 10ఎపిసోడ్ లను విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకొంది. ఇక ఈ షో రెండో సీజన్ లో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అంతకు మించి ఇవ్వడానికి రెడీ అవుతోంది. నిన్నటికి నిన్నే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆంథెమ్ ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సీజన్ లో అల్టిమేట్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నారట.
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, అనుష్క, సమంత ను పిలిచే ఉద్దేశ్యంలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో కు గెస్టుగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్నారట. అయితే ఎప్పుడు వస్తారు అనేది తెలియదు కానీ రావడం మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే అల్లు అరవింద్ టీమ్ చంద్రబాబును సంప్రదించారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక బాలయ్య- చంద్రబాబు బంధువలన్న విషయం తెల్సిందే. ఈ షోలో బాలయ్య.. చంద్రబాబు ను ఎలాంటి ప్రశ్నలు వేయనున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక చంద్రబాబు బుల్లితెరపైకి రావడం ఇదే మొదటిసారి.. అందులోనూ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో కు రావడం అంటే విశేషమనే చెప్పాలి. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాల్సిందే..