ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అసహజ శృగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని ఆరోపించారు. ఇతర పురుషులతో పడుకోవాలని తన నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ కూడా చేశాడని తెలిపారు. ఈ మేరకు సెలీనా తన భర్త పీటర్ హాగ్‌పై మంగళవారం గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు ఈ కేసు పెట్టినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. తనకు భరణంతో పాటు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని సెలీనా కోర్టును కోరారు.
మంగళవారం సెలీనా జైట్లీ తన భర్తపై పీటర్ హాగ్‌పై గృహ హింస కేసు నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ‘మా తల్లిదండ్రుల నుంచి పీటర్ ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశాడు. ఎంతో విలువైన డిజైనర్, ఆభరణాలను మా కుటుంబం ఇచ్చింది. ఇటలీలో మా హనీమూన్ సందర్భంగా నేను పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెబితే పీటర్ నాపై చిరాకు పడ్డాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని అడిగితే కోపంతో నాపై అరిచి, వైన్ గ్లాసును గోడకు పగలగొట్టాడు. కవలలను ప్రసవించిన తర్వాత పిల్లలను తీసుకోవడానికి పితృత్వ సెలవు తీసుకోవాలని కోరితే.. నన్ను అపార్ట్‌మెంట్ నుంచి బయటకు నెట్టాడు. నన్ను లైంగికంగా వేధించాడు. 2015 ప్రారంభంలో పీటర్ తన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యుడితో లైంగిక సంబంధంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. నిత్యం అసహజ శృగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. తన పైశాచిక ఆందనం కోసం నా నగ్న ఫోటోలను తీశాడు. వాటితో నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. పిల్లల ముందు నన్ను అసభ్యపదజాలంతో దూషించాడు’ అని సెలీనా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
Also Read: Andrea jeremiah : ‘పిశాచి 2’పై ఆండ్రియా వైరల్ కామెంట్స్..!
ఆస్ట్రియాలో పీటర్ హాగ్ కస్టడీలో ఉన్న తన పిల్లలను కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని సెలీనా జైట్లీ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. పిల్లలతో వర్చువల్‌గా మాట్లాడే అవకాశం అయినా కల్పించాలని కోర్టును కోరారు. పీటర్ నుంచి నెలకు రూ.10 లక్షల భరణం, రూ.50 కోట్ల పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ముంగళవారం ముంబైలోని ఓ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందుకు సెలీనా జైట్లీ దాఖలు చేసిన పిటిషన్ వచ్చింది. దీనిపై డిసెంబరు 12న మరోసారి విచారణ జరగనుంది. పిటిషన్ పరిశీలించిన అనంతరం పీటర్ హాగ్‌కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 2010లో పీటర్‌ను సెలీనా వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. కవల అబ్బాయిలు విన్స్టన్, విరాజ్ 2012లో జన్మించారు. ఆర్థర్ 2017లో జన్మించాడు. షంషేర్, ఆర్థర్ కవలలు. షంషేర్ గుండెపోటుతో మరణించాడు. 2004లో మంచు విష్ణుతో కలిసి సూర్యం సినిమాలో సెలీనా నటించారు.