దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. హారర్ జానర్‌కి కొత్త వాతావరణం తీసుకువచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా .. ఇప్పటికీ అభిమానుల మదిలో గుర్తుండిపోయింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ను మిస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ట్యాలెంటేబ్ అండ్ హాట్ బ్యూటీ నటి ఆండ్రియా జెరెమియా ప్రధాన పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత హైప్ పెరిగేలా చేసింది. అయితే, ఈ సినిమా అనేక కారణాల వల్ల చాలా కాలంగా వాయిదాలు ఎదుర్కొంటూ వచ్చింది. ఇంతలో, ఇటీవల ఆండ్రియా చేసిన కొన్ని కామెంట్లు సినిమా మళ్లీ చర్చల్లో నిలవడానికి కారణమయ్యాయి.
Also Read : Riddhi: ప్రభాస్‌తో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
ఆండ్రియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘పిశాచి 2’లో ఎలాంటి న్యూడిటీ లేదని, కానీ కథ డిమాండ్ మేరకు కొన్ని ఎరోటిక్ సీన్స్ ఉన్నాయని చెప్పింది. ఆమె ఈ మాటలు చెప్పగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో సినిమా గురించి ప్రేక్షకుల్లో కొత్తగా ఆసక్తి, కుతూహలం పెరిగింది. మరోవైపు, ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కేమియో రోల్‌లో కనిపించబోతున్నారన్న వార్త కూడా ఇప్పటికే క్రేజ్ క్రియేట్ చేస్తోంది. పూర్ణ, సంతోష్ ప్రతాప్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌ఫోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ హారర్ డ్రామాకు కార్తిక్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయబోతున్నారు.