George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా లాంచ్ రోజే డిస్ట్రిబ్యూషన్ కూడా లాక్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
‘జార్జ్ క్రిష్’కు సంబంధించిన నైజాం రైట్స్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ హక్కులను వాసుదేవ మూవీ క్రియేషన్స్, ఈస్ట్‌ను వింటేజ్ క్రియేషన్స్, వెస్ట్‌ను ఆదిత్య ఫిలిమ్స్, కృష్ణను వ్యోమ్ సినిమాస్, గుంటూరును ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు హక్కులను అభి సినిమాస్, సీడెడ్‌ను శిల్పకళ సంస్థలు దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ రైట్స్‌ను వ్యోమ్, సినిమా పారడిసో సంస్థలు నిర్వహించనున్నాయి. శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయనకు మరోసారి మంచి కమ్‌బ్యాక్ అందించే మూవీగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌ను సరికొత్త లుక్‌లో చూపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ టచ్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘జార్జ్ క్రిష్’.. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
తాజావార్తలు
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!