ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’ లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో నడుస్తోంది. ఈ షో కారణంగానే బన్నీని ఈవెంట్ కి వెళ్లాల్సిందిగా అరవింద్ కోరినట్లు అభిమానులు అనుకుంటున్నారు.
ఇక ఇది కాకుండా ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.. బన్నీకి బోయపాటి ‘సరైనోడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. వీరిద్దరి కాంబో మళ్లీ రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం కారణంగానే అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరవుతున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఈ కారణాల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ బాలయ్యబాబు ఈవెంట్ కి బన్నీ గెస్ట్ గా రావడం మాత్రం ఫ్యాన్స్ కి కిక్కునిస్తుంది.
ఇక వీటితో పాటు మరో కారణాన్ని కూడా నెటిజన్స్ ఎత్తిచూపుతున్నారు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎక్కువగా ఈవెంట్లకు హాజరుకావడం వలన ‘పుష్ప’ ప్రమోషన్ కి కూడా హెల్ప్ అవుతుందని, అందుకే బన్నీ ఈమధ్యకాలంలో ఎక్కువ ఈవెంట్లకు హాజరవుతున్నాడని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు.