బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ సికందర్ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈద్ సల్లూభాయ్‌కు సెంటిమెంట్ కావడంతో ఐపీఎల్ ఫీవర్ స్టార్టైనా సరే ఏ మాత్రం తగ్గేదెలే అంటూ పండుగ నాడు సినిమాను తెస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరోసారి మురగదాస్ తన మార్క్ చూపించినట్లే కనిపిస్తుంది. మార్చి 30న సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేస్తున్నాడు.
Also Read : Kollywood : హిట్ కాంబో సినిమాకు ఆర్థిక కష్టాలు..
సికిందర్ కు జస్ట్ 10 డేస్ గ్యాప్‌లో ఏప్రిల్ 10న మరో సీనియర్ స్టార్ సన్నీడియోల్ వచ్చేస్తున్నాడు. జాట్‌తో నార్త్ బెల్ట్‌లోకి అడుగుపెడుతున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. రీసెంట్లీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. పవర్ ఫ్యాక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా కనిపించబోతుంది. రెజీనా కాసాండ్రా, సయ్యామి ఖేర్, రమ్యకృష్ణ లాంటి వర్సటైల్ యాక్ట్రెసెస్ నటిస్తున్నారు. రణదీప్ హుడా విలన్ పాత్రలో భయపెడుతున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read : Kiara : అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలోకి టాల్ బ్యూటీ
జాట్ వచ్చిన వారం రోజులకే థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అక్షయ్ కుమార్. కేసరి చాప్టర్ 2ను ఏప్రిల్ 18 అంటే గుడ్ ప్రైడేన మూవీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన జలియన్ వాలా బాగ్ సంబంధించి తెలియని స్టోరీలను ఈ సినిమాతో చెప్పబోతున్నాడు కరణ్ సింగ్ త్యాగి. మాధవన్, అనన్య పాండే కీ రోల్స్ చేస్తున్నారు. సికందర్, జాట్, కేసరి 2లు ఒకే టైంలో పెద్ద గ్యాప్ కూడా లేకుండా థియేటర్లలోకి రావడంపై సినీ ఇండస్ట్రీలో ఓ వైపు క్యూరియాసిటి మరో వైపు టెన్షన్ నెలకొంది. జస్ట్ 20 డేస్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడంతో థియేటర్లు, కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని బాలీవుడ్ ట్రేడ్ భావిస్తోంది.