గ్లామర్ బ్యూటీ, ఛార్మింగ్ గర్ల్ కియారా అడ్వానీ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఎంఎస్ థోని అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ గా మారిన కియారా.. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలతో లక్కీ లేడీ గా మారింది. వీటితో పాటుగా ‘షేర్సా’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టడంతో సౌత్ హీరోలు, దర్శకుల దృష్టిని ఆకర్షించింది కియారా మీద. దీంతో ప్రజెంట్ సౌత్ నుండి వస్తున్న పాన్ ఇండియా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ ఆమె అవుతుంది. రీసెంట్ గా రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ తో పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇప్పుడు మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో రాబోతుంది..
ఇందులో మొదటిది బాలీవుడ్ మూవీ ‘వార్ 2’. హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో కియార కనిపించబోతుంది.ఇందులో హృతిక్‌కు జోడీగా నటించనుందట. దీంతో పాటుగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతూ, హీరో యష్ నుండి వస్తున్న మోస్ట్ హై బడ్జెట్ మూవీ ‘టాక్సిక్’ లో ఫిమేల్ లీడ్ లో కనిపించబోతుంది. ఇందులో నయన తార రాఖీ బాయ్ సోదరిగా నటిస్తుండగా.. యష్ సరసన కియారా నటిస్తోంది.ఇక రీసెంట్ గా సెట్‌లో యశ్, కియారా కలిసున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఒక డ్యూయెట్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారట.