Bigg Boss 7 Telugu Grand Finale Ex Contestants about Carrier:’బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆసక్తికరంగా జరుగుతోంది. ముందుగా ఈ స్టేజ్ మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నందమూరి కళ్యాణ్ రామ్, హీరో రోషన్ కనకాల బిగ్ బాస్ స్టేజ్‌పై మెరిశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో గ్రాండ్ ఫినాలే సందర్భంగా హౌస్ మేట్స్ తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో టాప్ రేపారు. ‘‘వాట్ లగాదేంగే..’’ అంటూ యావర్, ‘‘మాయదారి మైసమ్మా’’ సాంగ్‌తో శివాజీ ఆకట్టుకోగా ప్రియాంక ‘‘రంజితమే, రంజితమే’’ సాంగ్‌కు డ్యాన్స్ చేసి అదరగొట్టింది. పల్లవి ప్రశాంత్ మొక్కలు పట్టుకుని ‘‘తగ్గేదేలే’’ అంటూ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. అర్జున్.. ‘‘సలాం రాఖీ భాయ్’’ సాంగ్‌కు డ్యాన్స్ చేయగా అమర్ దీప్ ‘‘రాజా రాజా ది గ్రేట్ రా’’ పాటకు డ్యాన్స్ చేసి చివరిలో అందరూ ‘‘బ్యాడ్ యాస్’’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉన్నాయని నాగార్జున అడిగిన ప్రశ్నకు కంటెస్టెంట్స్ అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు.
Adhik Ravichandran: దర్శకుడితో ప్రభు కూతురు పెళ్ళి.. కట్నం గురించి దిమ్మతిరిగే వివరాలు వైరల్
తనపై నెగిటివిటీ పెరిగినా.. పాజిటివ్‌గా ముందుకెళ్తున్నానని శోభా తెలపగా భోలే షావలి అయితే శుభ శ్రీతో ఒక సాంగ్ ఆల్బమ్ చేసినట్లు వెల్లడించారు. గౌతమ్ తనకు మూడు సినిమాలకు ఆఫర్ వచ్చినట్లు వెల్లడించగా ఈబిగ్ బాస్ తనని టెన్ స్టెప్స్ పైకి తీసుకెళ్లినట్లు సందీప్ చెప్పాడు. ఈ క్రమంలోనే ‘యానిమల్’ సినిమాలో కూడా కొరియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. శుభశ్రీ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీలో ఆఫర్ వచ్చిందని, అది కాకుండా మరో రెండు సినిమాల్లో ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ తర్వాత తన లైఫ్ మారిపోయిందన్న టేస్టీ తేజ తనకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయన్నాడు. తన డాన్సు బాగా పాపులర్ అయ్యిందని అంతకు ముందు తాను సంపాదించింది ఓ ఎత్తైతే, హౌస్ లో ఉన్న ఆరువారాల్లో దాన్ని మించి సంపాదించాను అని తెలిపాడు.