Adhik Ravichandran Married Prabhu Daughter Photos goes Viral: ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం శుక్రవారం నాడు చెన్నైలో ఘనంగా జరిగింది. మార్క్ ఆంటోని సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ తో ఆమె వివాహం బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో విశాల్, మణిరత్నం, దుల్కర్ సల్మాన్, ఖుష్బూ లాంటి ప్రముఖులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రభు కుమార్తె ఐశ్వర్యకి ఇది రెండవ వివాహం. గతంలో ఆమెకు ప్రభు సోదరి కుమారుడు కునాల్ తో వివాహం జరగగా కునాల్ వృత్తి రీత్యా లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే వీరి జంట మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడి పోయారు. విడాకుల తర్వాత ఐశ్వర్య ఇండియాలో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టింది.
Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబుని పిలిచారా? లేదా?
ఈ క్రమంలో తన సోదరుడు విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇక అధిక్ రవిచంద్రన్ విశాల్ తో తెరకెక్కించిన మార్క్ ఆంటోని చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అధిక్ హీరో అజిత్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తన కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ రూపొందిస్తున్న సమయంలో ఆధిక్, ఐశ్వర్య లకు వివాహం జరిగింది. ఇక కూతురి పెళ్ళి సమయంలో తన అల్లుడికి నటుడు ప్రభు ఇచ్చిన కట్నం గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు అధిక్ రవిచంద్రన్ కి కోటి రూపాయల కట్నంతో పాటు విలాసవంతమైన బంగ్లా కూడా కట్నం రూపంలో ఇచ్చారని, అలాగే ఎంతో విలువైన బంగారు ఆభరణాలు కూడా పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.