టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ రీమేక్ చేస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా జూలై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్‌లో వర్షాల కారణంగా పాడైన భారీ విలేజ్ సెట్‌ను ఇప్పుడు రీసెట్ చేస్తున్నారు. ఇక తదుపరి షెడ్యూల్స్ బెంగళూరు, ముంబయి నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నుంచే ఈ సినిమాకు కథానాయికను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ అభిమానులకు కూడా చేరువ కాగా వినాయక్ ఏమైనా మార్పులు చేస్తాడేమో చూడాలి.