హాలీవుడ్ సృష్టించిన అభూత కల్పన పాత్రల్లో ఒకటి బ్యాట్ మాన్. కొన్ని దశాబ్దాలుగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై చిన్నల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంది ఈ క్యారెక్టర్. 1943 నుండి బ్యాట్ మ్యాన్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. కామిక్ నుండి ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక 2022లో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా వచ్చిన బ్యాట్ మ్యాన్ కూడా భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇండియాలో కూడా మంచి వసూళ్లను సాధించింది.
Also Read : Akhil : అయ్యగారు సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో?
బ్యాట్ మ్యాన్ సక్సెస్‌తో బ్యాట్ మాన్ సీక్వెల్ తెరకెక్కుతోంది. అయితే స్ట్రిప్ట్ రెడీ అయినా బ్యాట్ మ్యాన్ 2 షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 2027 అక్టోబర్ 1కి వాయిదా పడింది. దీంతో బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు చిత్ర హీరో రాబర్ట్ ప్యాటిన్సన్. ఈ సినిమా స్టార్టయ్యే టైంకి యంగ్ బ్యాట్ మ్యాన్ గా కనిపించిన నేను ఈ సీక్వెల్ వచ్చేటప్పటికీ ఓల్డ్ బ్యాట్ మ్యాన్ అయిపోతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే డీసీ స్టూడియోస్ కొత్తగా డీసి సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేయడం వల్ల, ఈ సినిమాను ఓ లెవల్లో తెరకెక్కించేందుకే జాప్యం చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. టెక్నికల్ గా విజువల్ గా ఈ సినిమాను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు డిలే చేస్తున్నారు అని హాలీవుడ్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. మరి ఈ బ్యాట్ మాన్ 2ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారో, అనుకున్న టైంకి సినిమాను రిలీజ్ చేస్తారో లేదో.