హాలీవుడ్ సృష్టించిన అభూత కల్పన పాత్రల్లో ఒకటి బ్యాట్ మాన్. కొన్ని దశాబ్దాలుగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై చిన్నల నుండి పెద్దల వరకు ఆకట్టుకుంది ఈ క్యారెక్టర్. 1943 నుండి బ్యాట్ మ్యాన్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. కామిక్ నుండి ఎన్నో సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక 2022లో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా వచ్చిన బ్యాట్ మ్యాన్ కూడా భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇండియాలో కూడా మంచి వసూళ్లను సాధించింది.…