Weapon Glimpse Released: కట్టప్పగా పాపులర్ అయిన సత్యరాజ్, జైలర్ సినిమాతో మెప్పించిన వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెపన్’ రిలీజ్ కి సిద్ధమైంది. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ మీనన్, నిర్మాత మన్సూర్, పివిఆర్ హెడ్ మీనా, రాజీవ్ పిళ్లై, డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘‘వెపన్’ లాంటి ఓ సినిమా తీయాలంటే నటీనటుల కంటే ముందుగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్ వాళ్లే కీలకం అని వాళ్ల తర్వాత యాక్టర్స్ కు ప్రాధాన్యత అని నా అభిప్రాయం అని అన్నారు. వెపన్ సినిమా విషయానికి వస్తే చాలా మంచి టీమ్ కుదిరింది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, నిర్మాతలైతే మరో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టి సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నారని అన్నారు.
Sugarcane Farming:చెరుకు సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతులు..
డైరెక్టర్ గుహన్ అయితే సరికొత్త విజన్ తో సినిమాను ఆవిష్కరించారని అన్నారు. బాహుబలి కంటే ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ సీన్స్ లో నటించాను కానీ ఫైట్ మాస్టర్ చక్కగా డిజైన్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలు పూర్తి చేశామని అన్నారు. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకు రావటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని ఆయన అన్నారు. వసంత్ రవి మాట్లాడుతూ ‘‘వెపన్’ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నాం. వెపన్ కథ వినగానే మనం చూసిన సూపర్ హీరోస్ సినిమాల్లా అనిపించింది, గుహన్ దీన్ని ఎలా చేస్తాడా? అని అనుకున్నాను అలాగే ఇందులో సత్యరాజ్ గారు సూపర్ హ్యూమన్ లా కనిపిస్తారనగానే హ్యాపీగా అనిపించిందని అన్నారు.