కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు ‘ఆయుష్మాన్ ఖురానా’. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ప్లే చేయగల ఆయుష్మాన్ కి మంచి క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉండే ఆయుష్మాన్ ఖురానా లేటెస్ట్ గా ‘అమ్మాయి’గా మారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి ఇది ఆయుష్మాన్ కెరీర్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమా. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నుష్రత్ భారుచా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా డ్రీమ్ గర్ల్ 2 తెరకెక్కుతోంది. రాజ్ షాండిల్యా డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ అనౌన్స్మెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనన్య పాండేగా హీరోయిన్ గా నటిస్తున్న డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
దాదాపు మూడున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ ఫుల్ గా నవ్వించింది. ఆయుష్మాన్ లేడీ గెటప్ లో కనిపించిన ప్రతిసారి ఫ్రేమ్ లో ఇంకెవరినీ కనిపించకుండా చేసే అంత అందంగా ఉన్నాడు. తమిళ సినిమా రెమో స్టైల్ లో ట్రైలర్ ని కట్ చేసినట్లు అనిపించింది కానీ కథాకథనాల పరంగా రెండు వేరు వేరు అయ్యే అవకాశం ఉంది. పరేష్ రావల్, రాజు యాదవ్ ల కామెడీ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. మరి ట్రైలర్ తో మంచి ఫన్ రైడ్ లాంటి సినిమా అనే నమ్మకం కలిగించిన మేకర్స్, ఆగస్టు 25న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.