సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమాలో వార్ 2 సినిమాకి లీడ్ ఇచ్చారు. పోస్ట్ క్రెడిట్స్ లో వార్ 2 సినిమాకి లీడ్ గా హ్రితిక్ రోషన్ ని రెండున్నర నిమిషాల పాటు చూపించారు. యాక్షన్ ఎపిసోడ్ లో హ్రితిక్ ఫేస్ చూపించకుండా కట్ చేసి… లాస్ట్ లో హ్రితిక్ ని రివీల్ చేశారు. ఈ క్యామియో హ్రితిక్ ఫ్యాన్స్ నే కాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఎంటర్టైన్ చేస్తోంది.
హ్రితిక్ రోషన్ వార్ ఫ్రాంఛైజ్ లో కబీర్ గా నటిస్తున్నాడు. మొదటి పార్ట్ లో కబీర్ చేసిన యాక్షన్ కి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు, ఇప్పుడు పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ వార్ 2లో హ్రితిక్ కి విలన్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆఫీసర్ అషుతోష్ రానా, కబీర్ కి ఒక మిషన్ అప్పగిస్తాడు. “ఇప్పటివరకూ ఒక ఆఫీసర్ ఇంకో సోల్జర్ ని అడగనిది, ఒక తండ్రి కూడా తన కొడుకుని అడగలేనిది… నేను నిన్ను అడుగుతున్నాను. ఇండియా ఒక బిగ్గెస్ట్ డెవిల్ ని ఫేస్ చేయబోతుంది. అతను చీకటిలో ఉంటాడు, ఫేస్ తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు… అతన్ని పట్టుకోవాలి అంటే నువ్వు చీకట్లోకి వెళ్ళాలి… జాగ్రత్త డెవిల్ తో పోరాడుతూ పోరాడుతూ నువ్వూ డెవిల్ అయిపోవద్దు” అని అషుతోష్ రానా క్యారెక్టర్ హ్రితిక్ రోషన్ ని చెప్తాడు. ఈ డైలాగ్ వెర్షన్ లో అషుతోష్ చెప్పేది… ఎన్టీఆర్ గురించే అనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. మరి ఆ డెవిల్ వార్ 2లో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.