Arjun Ambati eliminated from Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుండగా ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైనట్టు తెలుస్తోంది. ఫినాలే కోసం ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ లీక్స్ ద్వారా తెలిసింది. నిజానికి ఆదివారం అంటే రేపటితో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగియనుంది. ఆరోజే విన్నర్ ను నాగార్జున ప్రకటించేందుకు పక్బందీగా ప్లాన్ చేసి గత సీజన్స్ లాగా కాకుండా ఈసారి విజేత విషయంలో ఎలాంటి లీక్ లు లేకుండా చూసుకునేందుకు గట్టి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే షూట్ కూడా మొదలు కాగా ఆరుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేసినట్లు చెబుతున్నారు. అర్జున్ అంబటి, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్‌దీప్ ఫైనలిస్టులుగా ఉండగా ఈ ఆరుగురిలో అర్జున్ రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. టాలీవుడ్ నుంచి చిరంజీవికి ఆహ్వానం?
కానీ అర్జున్ ఫినాలే అస్త్ర పొందడంతో ఈ సీజన్‌లోనే తొలి ఫైనలిస్టుగా నిలిచి ఆ వారం ఓట్ల మద్దతు లేకున్నా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టాడు. ఇక తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్‌లో అర్జున్ చివరిస్థానంలో ఉండే అవకాశం ఉన్నా అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. నిజానికి అర్జున్ సీజన్ ప్రారంభమైనప్పుడే హౌస్‌లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఐదు వారాల తరువాత వచ్చినా సింగిల్‌గా ఆడి ఫినాలే వరకు రాగలిగాడు కానీ ప్రేక్షకాదరణ పొందడంలో మాత్రం అర్జున్ ఎందుకో విఫలమయ్యాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అనే మాటే కానీ టాస్కులు ఆడి మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చి చివరి దాకా నిలబడ్డాడు. ఇక అర్జున్ అంబటికి అత్యధికంగా వారానికి రూ. 4.5 లక్షలు వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.