Chiranjeevi Invited for Ayodhya Ram Mandir Opening Ceremony from tollywood: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుక కోసం టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరుగనుంది. అన్ని వర్గాల, రంగాల నుంచి ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించబడుతున్నారు. ఇక ఈ వేడుకకి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపబడింది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవికి ఒక్కరికే ఆహ్వానం అందింది. తమిళం నుంచి రజనీకాంత్, ధనుష్, మలయాళం నుంచి మోహన్‌లాల్, కన్నడ నుంచి కాంతార నటుడు రిషబ్ శెట్టిలకు ఈ ఆహ్వానం అందింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి నిర్మాత మహావీర్ జైన్‌కి కూడా ఆహ్వానం అందింది. ఇక బాలీవుడ్ నుంచి నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్‌లకు ఆహ్వానం అందింది.
Nikhil Siddhartha: సలార్ సినిమా 1 గంట షోకి 100 టికెట్లు ఇస్తా.. హీరో నిఖిల్ బంపర్ ఆర్
రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ మరియు రోహిత్ శెట్టి వంటి బాలీవుడ్ దర్శకులని ఆహ్వానించారు. ఇక ఈ శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరం గర్భగుడిలో ప్రతిష్టిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇక క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పారిశ్రామికవేత్తలలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా కూడా ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారని బాలీవుడ్ మీడియా నివేదించింది. ఇక శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ఈ గౌరవనీయులైన వారితో ఘనంగా నిర్వహించబడుతుందని హామీ ఇచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, రామమందిరం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కర సేవకుల కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు. అంతేకాకుండాఈ ప్రతిష్ఠ వేడుక దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని అంటున్నారు.