Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస మూవీల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ సేతుపతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కావాలని నటుడిగా మారలేదు. అనుకోకుండా అయ్యాను. సౌత్ లో నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాజ సినిమాలో నటించడం వల్లే నాకు బాగా కలిసొచ్చింది. ఆ మూవీని విజయ్ సేతుపతి అడగడం వల్లే చేశాను. అది మంచి హిట్ కావడంతో నాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. విజయ్ సేతుపతి వల్లే నా కూతురి వివాహం కూడా చేశాను.
Read Also : Jagga Reddy: అమెరికా చెబితే మోడీ పాక్తో యుద్ధాన్ని ఆపేశాడు.. ఇందిరా గాంధీ అలా చేయలేదు..
నా కూతురు వివాహం చేయాలని అనుకన్నప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. ఇదే విషయాన్ని విజయ్ సేతుపతికి ఓ సారి చెప్పాను. ఆయన ఆర్థిక సాయం చేస్తానని అన్నారు. ఆ టైమ్ లోనే మహారాజ మూవీలో ఆఫర్ ఇప్పించారు. ఆ మూవీ చేయడం వల్ల వచ్చిన డబ్బులతో నా కూతురు వివాహం చేయగలిగాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూతురు పెళ్లి చేసేశాను. ప్రస్తుతానికి నాకు ఎలాంటి ఇబ్బందులులేవు. మహారాజ తర్వాత సేతుపతితో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. నాకు ఏ అవసరం వచ్చినా ఆయన అండగా ఉంటారు. నార్త్ కంటే నాకు సౌత్ లోనే నటుడిగా ఎక్కువ అవకాశాలు వచ్చాయి’ అంటూ తెలిపాడు అనురాగ్.
Read Also : OG : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ షూట్ రీ స్టార్ట్..