Anu Emmanuel’s Disasters streak continues with Japan movie too: మలయాళ మూలాలు ఉన్న అను ఇమ్మానియేల్ అమెరికాలో పుట్టి పెరిగింది. తర్వాత బాలనటిగా మలయాళ పరిశ్రమ ద్వారా పరిచయమై యాక్షన్ హీరో బిజు అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఇక ఆ అనంతరం తెలుగులో మజ్ను అనే సినిమా చేసి ఓ మాదిరి హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె దురదృష్టమో లేక సినిమా కథల ఎంపిక పట్ల అజాగ్రత్తనో తెలియదు కానీ చేసిన దాదాపు అన్ని సినిమాలు దారుణమైన డిజాస్టర్ గా నిలుస్తూ వస్తున్నాయి. మజ్ను తర్వాత చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజ రెడ్డి అల్లుడు, అదుర్స్, మహాసముద్రం, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర సినిమాలు దారుణమైన డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మధ్యకాలంలో కార్తితో ఆమె చేసిన జపాన్ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
Samantha: టిల్లు గాడితో సామ్ రొమాన్స్?
వాస్తవానికి ఈ సినిమాలో ఆమెది అంత చెప్పుకోదగ్గ పాత్ర ఏమి కాదు. ఏదో కాస్త గ్లామర్ వలకబోయాల్సిన పాత్రలో తీసుకొచ్చి ఆమెను నటింపజేశారు. ఆ సినిమా కూడా ఇప్పుడు దారుణమైన డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఈ డిజాస్టర్ కూడా ఆమె ఖాతాలో పడింది. అను ఇమ్మానియేల్ సినిమాలో గనక భాగమైతే అది కచ్చితంగా డిజాస్టర్ గా నిలుస్తుందని, జపాన్ సినిమా తేల్చి చెప్పిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ కు కేటాయించిన డేట్లు కూడా షూటింగ్ కేటాయించిందో లేదో తెలియదు. అంత చిన్న పాత్ర ఆమెది, కానీ ఈ డిజాస్టర్ కూడా ఆమె ఖాతాలో పడడం గమనార్హం. ఇకమీదటైనా ఎంపిక చేసుకునే సినిమాలు విషయంలో జాగ్రత్త వహించకపోతే ఆమె కెరీర్ కి త్వరలోనే ఫుల్ స్టాప్ పడడం ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.