Samantha to pair with Siddhu Jonnalagadda: విడాకులు తీసుకుని కొన్నాళ్లు, అనారోగ్యం బారిన పడి కొన్నాళ్లు వార్తల్లో నలిగిన సమంత కావాలనే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగినా సుమారు నెలరోజులు మాత్రమే అక్కడ ఉండి ఇండియా తిరిగి వచ్చిన ఆమె ఇప్పుడు పలు ప్రాజెక్టుల విషయంలో తల మనకలైంది. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునేందుకు పలు పాన్ ఇండియా ప్రాజెక్టుల మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె డీజే టిల్లు, హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఒక సినిమా చేయబోతుందని ప్రచారం రూపొందుతుంది. సమంత, నందిని రెడ్డి గతంలో జబర్దస్త్, ఓ బేబీ లాంటి సినిమాలకు కలిసి పనిచేశారు.
Tiger 3: టైగర్ కి ఎందుకీ స్పెషల్ ట్రీట్మెంట్? ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న నెటిజన్లు
వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి మరో ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో పడ్డారట. ఈ ప్రాజెక్టులో నాగచైతన్య హీరోగా తీసుకుంటారని ముందు ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ వచ్చి చేరాడు అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు డిస్కషన్ స్టేజ్ లో ఉంది, అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే సమంత క్రేజ్ తో పోల్చినా, ఎక్స్పీరియన్స్ తో పోల్చినా సిద్దు జొన్నలగడ్డ చాలా చిన్నవాడే. కానీ అలాంటి హీరోతో కూడా సమంత సినిమా చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే తన స్నేహితురాలు నందినీ రెడ్డి కోసమే సమంత ఈ రిస్కు తీసుకునేందుకు సిద్ధమైందని, రెమ్యూనరేషన్ కూడా తాను తీసుకునే రేంజ్ కాకపోయినా స్నేహితురాలి కోసం సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు నందినీ రెడ్డి గాని ఇటు సమంత గాని హిట్స్ లో లేరు. అలాంటి ఇద్దరు కలిసి కాస్త జోష్ లో ఉన్న సిద్దు జొన్నలగడ్డతో ప్రాజెక్ట్ సెట్ చేయడం ఆసక్తికరం.