Annapurnamma: సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న వయస్సులోనే.. తనకన్నా పెద్దవారు అయిన స్టార్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు బామ్మగా మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె అనారోగ్యానికి గురై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక తాజాగా అన్నపూర్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. అన్నపూర్ణ.. అమ్మాయిలు వేసుకొనే డ్రెస్ ల గురించి చేసిన కామెంట్స్ పై చిన్మయి స్పందించడం, భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం నా కర్మ అని చెప్పడంతో.. చిన్మయిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఇక ఈ కేసు గురించి పక్కన పెడితే.. అదే ఇంటర్వ్యూలో అన్నపూర్ణ.. హీరోయిన్స్ సౌందర్య, శ్రీదేవిల గురించి మాట్లాడింది.
” ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను చాలా తక్కువ మాట్లాడతాను. బాగా మాట్లాడేది అంటే.. వై విజయ, డబ్బింగ్ జానకి.. సౌందర్య.. ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది. శ్రీదేవి కూడా బాగా మాట్లాడుతుంది కానీ కొంచెం రిజర్వ్డ్ టైప్. ఇక మిగతావారందరితో నాకు నచ్చితే మాట్లాడతాను. ఎక్కువసార్లు మాట్లాడుకోము కానీ, ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కలిసి వెళ్తాము. శ్రీలక్ష్మీ, నేను. పెళ్ళికి కార్డు వస్తే.. నేను వెళ్తున్నా.. నువ్వు కూడా వస్తావా అని అడుగుతాను. ఆమె అడిగినప్పుడు.. నాకు నచ్చితే వెళ్తాను. లేకపోతే ఇంట్లోనే ఉంటాను. నాకు నా ఇల్లు అంటే చాలా ఇష్టం. బయటకి ఎక్కడికి వెళ్ళాలి అనుకోను” అని చెప్పుకొచ్చింది.