బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది.ఈ వీకెండ్ లో డంకీ, సలార్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కూడా యానిమల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతుంది.థియేటర్స్ లో 3 గంటల 21 నిమిషాలకు పైగా రన్ టైం తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ నిడివితో ఉండబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.సందీప్ రెడ్డి వంగా ఆమధ్య ఓటీటీలో యానిమల్ మూవీని నాలుగు గంటల నిడివితో విడుదల చేయబోతున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది.
అయితే తాజా సమాచారం ప్రకారం థియేటర్ వెర్షన్ రన్ టైం కంటే ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు అదనంగా మరో 7 నుంచి 8 నిమిషాల కీలక సన్నివేశాలను యాడ్ చేయనున్నారట.. నిజానికి ఈ కీలక సన్నివేశాలను థియేటర్లోనే చూపించాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనుకున్నాడు. కానీ అప్పటికే ఓవర్ రన్ టైం అవ్వడంతో ఆ ఫుటేజ్ ని ఎడిటింగ్ లో తీసేసారట. ఇప్పుడు ఆ సన్నివేశాలని ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేస్తున్నారు.ఆ సన్నివేశాలతో కలిపి యానిమల్ ఓటీటీ వెర్షన్ సుమారు మూడున్నర గంటల రన్ టైంతో ఉంటుందని సమాచారం.యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది క్రేజీ న్యూస్ అనే చెప్పవచ్చు. కాగా ‘యానిమల్’ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆల్మోస్ట్ థియేటర్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జనవరిలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది