బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాలో ఆమె పాత్ర కూడా సరైన ప్రాధాన్యత ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తే సినిమా హిట్ అనే నమ్మకానికి వస్తున్నారట మేకర్స్.
స్టార్లకు అనసూయ లక్కీ చాంప్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనసూయ, రవితేజ , రమేష్ వర్మ కాంబోలో వస్తున్నా ఖిలాడీ లో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ సినిమా నుంచి అనసూయ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రకళ అనే పాత్రలో అనసూయ కనిపిస్తుందని తెలుస్తోంది. చీరకట్టులో పద్దతిగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ సినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. మరి మొన్న రంగమ్మత్త.. నిన్న దాక్షాయణి.. ఇప్పుడు చంద్రకళగా అనసూయ రఫ్ఫాడిస్తుందేమో చూడాలి.