‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో ‘8 వసంతాలు’ అనే సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా, నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా..
అయితే మనకు తెలిసి కొంతమంది సినీ సెలబ్రిటీలకు నటనతో పాటు వేరే విద్యల్లో కూడా ప్రవేశం ఉంటుంది. తాజాగా హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్‌కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.. అవును అనంతిక ఆల్రెడీ కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకుందట. మలయాళం ఫేమస్ డ్యాన్స్ మొహినియాట్టం కూడా నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరిపట్టు కూడా నేర్చుకుంది. ఇలా మూడు డిఫరెంట్ విద్యలు నేర్చుకోవడమే కాక చదువులో బయోటెక్నాలజీ చదివింది. అంతే కాకుండా..
ఇప్పుడు లా కోర్స్ చదువుతుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనంతిక కూడా మాట్లాడుతూ.. ‘ ‘8 వసంతాలు’ స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం. ఇలాంటి ఓ అందమైన ప్రేమకథా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో కుదిరింది. ఈ కథ విన్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న. నేను కోరుకున్న ప్రతి అంశం ఈ కథలో ఉంది. ప్రేక్షకులకు ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కోసం నేను కళరి అనే ఫైట్ కూడా నేర్చుకున్నా’ అని అనంతిక తెలిపింది. అలాగే ‘రాజకీయ నాయకురాలు కావాలన్నది నా ఆశయం, అందుకే న్యాయ విద్యను అభ్యసిస్తున్నా, నాకు 40 ఏళ్లు వచ్చాకే పాలిటిక్స్‌లోకి అడుగుపెడతానని’ నవ్వుతూ సమాధానమిచ్చిందీ భామ.