ఆరు పదుల వయస్సులోనూ తెలుగు చిత్రాల పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా, బాలకృష్ణ కెరీర్‌లోనే ఊహించని హిట్ అందుకుంది, తెలుగు సినిమా చరిత్రలో ఓ మాస్ మూవీగా నిలిచింది. దర్శకుడు బోయపాటి శ్రీను సృష్టించిన అఘోరా పాత్ర, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ బీజీఎం థియేటర్ లో స్పీకర్ బద్దలైపోయాయి.
Also Read : Fathers Day : నాన్నంటే అలుపెరుగని పోరాటం.. నేడే ఫాదర్స్ డే..!
దీంతో సీక్వెల్ కథ మరింత దారుణమైన శక్తులతో, ఆధ్యాత్మికత, యాక్షన్, డ్రామా మేళవింపుతో వస్తుందని తాజాగా విడుదలైన టీజర్ తోనే అర్ధం అవుతుంది. టీజర్ బాలకృష్ణకు ఇచ్చిన ఎలివేషన్, గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు దుమ్ము లేచిపోయింది. ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఇక తాజా సమాచారం ప్రకారం యూఎస్ మార్కెట్‌లో కూడా బాలయ్య కెరీర్లోనే రికార్డు డీల్‌తో బరిలోకి దిగబోతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్‌లో సుమారు $2 మిలియన్ టార్గెట్ తోనే విడుదల కానుంది. అయితే లాభాల బాట పట్టాలంటే కనీసం $5 మిలియన్ కి పైగా వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ 25న విడుదల కానుక ఈ మూవీ మూమెంట్ అయితే గట్టిగానే ఉంది. మరి చూడాలి అఖండ ఓవర్సీస్ మార్కెట్ లో ఆడించే తాండవం ఎలా ఉంటుందో.